Paneer Rasgulla
పన్నీర్ రసగుల్లా
కావలసిన పదార్థాలు .
పనీర్ - అర కేజీ.
కండెన్స్‌డ్ మిల్క్ - పావు లీటర్
పంచదార - పావు కేజీ
మైదా - అర కప్పు
ఇలాచి పౌడర్ - 1/2 టీస్పూన్
కుంకుమ పువ్వు - కొద్దిగా
తయారు చేసే విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, పంచదార వేసి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతుండాలి. పనీర్, మైదా పిండి కలిపి ఉండలుగా చేసుకో వాలి. ఇప్పుడు ఈ ఉండలను పాకంలో వేసి 10 నిమిషాల వరకు ఉడకనిచ్చి దింపెయాలి. చల్లారిన తరువాత ఉండలను బయటకు తీయాలి. కండెన్స్‌డ్ మిల్క్‌లో కుంకుమపువ్వు, యాలకుల పొడివేసి కలిపి అందులో ఈ ఉండలను వేయాలి అంతే నోరూరించే పన్నీర్ రసగుల్లా రెడీ ...