Childrens day Special

 

 

 

చాకోలెట్ తో గులాబ్ జామున్

 

 

కావలసినవి :

గులాబ్ జామ్ పౌడర్  - 1కప్పు
డైరీ మిల్క్ చాకోలెట్ - 1
పాలు - ఒక కప్
పంచదారా -  ఒకటిన్నర కప్పు
డాల్డా - సరిపడా

 

తయారీ :

 

ముందుగా చాకొలేట్ ని కొన్ని నీళ్ళు తీసుకుని కలిపి పేస్ట్  లా చేసుకొని అందులో గులాబ్ జామున్ పొడి వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు కొద్దిగా పాలు కూడా వేసుకుని పిండి  కలుపుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో  రెండు గ్లాస్ ల నీళ్ళు, పంచదార   కలిసే వరకు గరిటతో తిప్పి తీగ పాకం వచ్చే వరకు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపి ఉంచుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని డాల్డా వేసి కరిగి వేడయ్యాక చేసి పెట్టుకున్న ఉండలను ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని వాటిని పంచదారా పాకంలో వేసి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ వెరైటీ  చాకొలేట్ గులాబ్ జామున్ రెడీ

 

*******

 

చాకొలెట్ బాదాం హల్వా

 

 

కావలసిన పదార్థాలు:

పాలు-అర లీటరు
కోకో పౌడర్- అర కప్పు
పంచదార - 250 గ్రాములు
బ్రెడ్ స్లైసులు -2
జీడిపప్పు పొడి- రెండు స్పూన్లు
 కిస్‌మిస్ - కొన్ని
నెయ్యి - రెండు స్పూన్స్
బాదంపప్పు- 50గ్రాములు

 

తయారీ:
ముందుగా  పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించి పెట్టుకోవాలి. తరువాత  పాలలో బ్రెడ్ స్లైస్ లు , కోకో పౌడర్ , పంచదార, బాదాం నానపెట్టి పొట్టు తీసుకుని  చేసుకున్న పేస్ట్,  కొద్దిగా జీడిపప్పు పొడి వేసి కలిపి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం గట్టిగా హల్వాలా అయిన తరువాత చివరిలో నెయ్యి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు  ప్లేటకి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకుని హల్వాను ప్లేట్ లో వేసుకుని ముక్కలుగా కట్ చేసి దానిపై కిస్మిస్, జీడిపప్పు,బాదాం పలుకులు వేసి డెకరేట్ చేసుకోవాలి.