Read more!

Paneer kofta Curry

 

 

 

 పన్నీర్ కోఫ్తా కర్రీ

 

 

 

కావలసిన పదార్ధాలు :
పన్నీర్- 200 గ్రాములు
బేకింగ్ పౌడర్ -1/4 టీ స్పూను
పచ్చిమిర్చి  - 5
అల్లంవెల్లుల్లి ముద్ద-1 టీ స్పూను,
కార్ ఫ్లోర్ - అర కప్పు
ఉల్లిపాయలు -3
పసుపు- 1/4  స్పూన్
ధనియాలపొడి -1 స్పూన్
ఉప్పు - తగినంత
కారం - ఒకటిన్నర స్పూన్
నూనె -సరిపడా
జీడిపప్పు -అర కప్పు
గరమ్ మసాలా - ఒక స్పూన్
మిరియాల పొడి -1  స్పూన్
టమాటాలు - పావు కేజీ

 

తయారు చేసే పధ్ధతి :
ముందుగా  పన్నీర్ ను ముక్కల్నీ మెత్తగా  ముద్దలా చేసుకోవాలి . తరువాత బేకింగ్ పౌడర్,మిరియాల పొడి ,సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా గరమ్ మసాలా ,కార్న్ ఫ్లోర్ , ఉప్పు వేసి చిన్నగా  కట్  చేసుకున్న  జీడిపప్పును  వేసి బాగా కలిపి చిన్న ఉండలు తీసుకుని  కోఫ్తా లుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్  వెలిగించి పాత్ర పెట్టి నూనె వేసి కాగాక  కోఫ్తాలను ఒక్కొక్కటి గా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి  పెట్టుకోవాలి తరువాత్ స్టవ్ పై పాన్ పెట్టి  నూనె పోసి ఉల్లిపాయ  పేస్ట్ వేసి  వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్,కారం, ధనియాలపొడి ,పసుపు  వేసి ఒక  రెండు నిముషాలు వేయించి తరువాత   టమాటా పేస్ట్, ఉప్పు వేసి ఒక  ఐదు నిముషాలు ఉడికించి కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడ్డాక  గరమ్ మసాలా వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి తరువాత  వేయించుకున్న కోఫ్తాలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.