Paneer baby corn curry
బేబీ కార్న్ పన్నీర్ కుర్మా
కావలసినవి :
బేబీ కార్న్ : అర కేజీ
పన్నీర్ : 100 గ్రాములు
ఉల్లిపాయలు : 2 పెద్దవి
పచ్చిమిర్చి : 4,
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్
టమాటోలు : 2,
జీడి పప్పు :20 గ్రాములు
కారం : ఒక స్పూన్
పసుపు : చిటికెడు
గరం మసాల :ఒక స్పూన్,
ఉప్పు : తగినంత.
తయారీ :
ముందుగా బేబీ కార్న్ ను ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగక సగం ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి సగం టమాటో ముక్కలు కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత కారం పసుపు ,ఉప్పు వేసి కలపాలి .గరం మసాల వేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి మిగిలినఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి ,జీడి పప్పు ,టమేటో ముక్కలను వేసి వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కర్రీ లో వేసి వేగిన తరువాత బేబీ కార్న్ ,పన్నీర్ వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి పదిహేను నిముషాలు ఉడికించి చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.