Pakam Garelu & Vakkaya Pulihora

 

 

 

పాకం గారెలు

 

 

 

తయారు చేసే విధానం:
  పాకం గారెలు తయారు చేయడానికి రెండు మూడు గంటలు ముందే మినప్పప్పు ను నానబెట్టి గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. ఆ తరవాత ఒక స్టవ్ పై డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ఆ లోపు ఇంకో స్టవ్ పై 1 కప్పు పంచదార , ఒక కప్పు నీళ్ళు వేసి పాకం తయారు చేసుకోవాలి.నూనె కాగాక గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పిండిని గారెల్లా వత్తుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.తయారైన పాకంలో యాలకుల పొడి వేసి కలిపి ఫ్రై చేసుకున్న గారెలనుకూడా అందులో  వేసి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. వేడి వేడి పాకం గారెలు రెడీ.

 

 

వాక్కాయ పులిహోర 

 

 

 

తయారు చేసే విధానం:
స్టవ్ పై బాణలి పెట్టి అందులో తగినంత నూనె పోసి అది కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, శనగపప్పు, మినప్పప్పు , కరివేపాకు , పసుపు , పచ్చిమిర్చి , తరిగిన వాక్కాయ, ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకుని అన్నం వేసి బాగా కలపాలి. అంతే వాక్కాయ పులిహోర రెడీ.