Allam Pachadi
అల్లం పచ్చడి
కావాల్సిన పదార్ధాలు:
నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
ధనియాలు - రెండు టేబుల్ స్పూన్స్
మినపప్పు - ఒక టేబుల్ స్పూన్
పచ్చిశెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయాలు - 50 గ్రాములు
అల్లం తరుగు - పావు కప్పు
బెల్లం - పావు కప్పు
ఉప్పు - సరిపడా
చింతపండు - 50 గ్రాములు
వేడి నీళ్లు - 70 ఎంఎల్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
వెల్లులి - 12 రెబ్బలు
తయారీ విధానం:
* ఒక కళాయిలో నూనె వేసి అందులో ధనియాలు, మినపప్పు,సెనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి.
* వేగిన పప్పులలో ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసి ఎర్రగా వేపుకోవాలి.
* వేపుకున్న పప్పుల్ని, ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకుని, ఇంకా ఇందులో మిగిలిన పదార్దాలు అన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
* పచ్చడిని ఒక్కసారి రుచి చూసి అవసరాన్ని బట్టి ఉప్పు బెల్లం చింతపండు వేసుకోండి.