Dondakaya Roti Pachadi

 

 

దొండకాయ రోటి పచ్చడి

కావాల్సిన పదార్ధాలు:

దొండకాయలు - పావు కేజీ

పచ్చిమిర్చి - 100గ్రాములు

చింతపండు - సరిపడ

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

కొత్తిమీర - పావుకప్పు

ఉప్పు - సరిపడా

నూనె - ఒక టేబుల్ స్పూన్

మెంతులు - ఒక టేబుల్ స్పూన్

ఆవాలు - ఒక టేబుల్ స్పూన్

మినపప్పు - ఒక టేబుల్ స్పూన్

సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

కరివేపాకు - ఒక రెబ్బ

తాలింపు కోసం:

నూనె - పావు కప్పు

ఆవాలు - అర టీస్పూన్

జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్

మినపప్పు - అర టీస్పూన్

సెనగపప్పు - అర టీస్పూన్

ఎండుమిర్చి - రెండు

ఇంగువా - చిటికెడు

తయారీ విధానం:

* కొద్దిగా నూనె వేసి ముందుగా మెంతులు వేసి వేపుకుని అవి వేగాక ఆవాలు, మినప పప్పు, శెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుని పక్కన పెట్టుకోవాలి.

* అవి చల్లారాక మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. * ఇప్పుడు అదే మూకుడులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేయించుకుని అవి వేగిన తర్వాత తరిగిన దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి.

* దొండకాయ ముక్కలు మగ్గాక చింతపండు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాక దింపేసి చల్లార్చుకోవాలి.

* ఇప్పుడు మిక్సీ జార్ లో చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు, మెత్తగా పొడి చేసుకున్న తాలింపు, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

* ఇప్పుడు మరొక కళాయి తీసుకుని అందులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శెనగపప్పు,జీలకర్ర, ఎండుమిర్చి , కొత్తిమీర వేసి వేపుకుని ఆఖరున చిటికెడు ఇంగువ వేసి తాలింపు దింపేసి పచ్చడి లో కలుపుకోవాలి.