Munagaku Pachadi
మునగాకు పచ్చడి
కావలసిన పదార్ధాలు:
మునగాకు - 1/4 kg
చింతపండు - కొద్దిగా
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - 2 కట్టలు
వెల్లులి - 4 రెబ్బలు
జీలకర్ర - 1/2 చెంచా
ఉప్పు - తగినంత
పసుపు - 1 /8 స్పూన్
పల్లీలు - 1/4 కప్పు
నూనె - సరిపడినంత
తాలింపుగింజలు - కొద్దిగా
తయారీవిధానం:
మునగాకు... కడిగి ఆరబెట్టి పుల్లలు, ఈనెల లేకుండా దూసి ఉంచుకోవాలి..
పొయ్యిమీద పాన్ లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లులి, జీలకర్ర వేయించాలి... అవివేగాక.. మునగాకు వేసి వేయించుకోవాలి.
పసుపు వేసి... అవి పూర్తిగా వేగుతున్న సమయంలో కొత్తిమీర ఆకులువేసి ఉప్పు, చింతపండు వేసి ముత్తపెట్టి మగ్గనిచ్చి పొయ్యిమీద నుండి దించి చల్లారనివ్వాలి.
ఈ లోగా పల్లీలు దోరగా పొడి మూకుడులో వేయించుకోవాలి. ఇవ్వన్నీ కలిపి పచ్చడిలా రుబ్బుకోవాలి.
ఈ పచ్చడిని విడిగా గిన్నెలోకి తీసుకుని పైన నూనెలో వేయించిన తాలింపుగింజలు, కరివేపాకు వేసుకోవాలి...
ఈ పచ్చడి చాలా బావుంటుంది.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
- భారతి