జొన్నమురుకులు

 

జొన్నమురుకులు

కావాల్సిన పదార్ధాలు:

జొన్నపిండి- 3 కప్పులు

నువ్వులు - అర కప్పు

వేరుశనగపొడి - 1 కప్పు

వాము - 1 టేబుల్ స్పూన్

పచ్చిమిర్చిపేస్టు - సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

వెన్న- 2 టేబుల్ స్పూన్స్

వేయించడానికి నూనె

తయారీ విధానం:

సాధారణంగా మురుకులు బియ్యపిండి, మినపపిండి, పెసర పిండితో తయారు చేస్తుంటారు. ఇలా దేని రుచి దానికే ఉంటుంది. అయితే జొన్నపిండి కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. జొన్నపిండితో మురుకులు చేస్తే చాల చక్కని రుచి ఉంటుంది. జొన్నపిండిలో నువ్వులు, వేరుశనగపొడి, వాము, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, 2 చెంచాల వెన్న వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి మెత్తగా మురుకుల పిండి వలె చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై ఒక కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత మురుకుల పీఠతో ఒత్తుకోవాలి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సన్నని మంటపై వేయించుకోవాలి. ఇలా చేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా కరకరలాడే మురుకులు సిద్ధమవుతాయి. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.