Mixed Sprouts Curry
Mixed Sprouts Curry
పిల్లలతో ఇలాంటి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తినిపించాలి అంటే చిన్న, చిన్న మేజిక్ లు చేయాలి... స్ప్రౌట్స్ తో రకరకాల ప్రయోగాలూ చేయచ్చు. కాని పిల్లలు తినాలి అంటే రంగు, రుచి దగ్గర జాగ్రత్త పడితే చాలు. అన్నిరకాల గింజల్ని నానబెట్టి ఉంచుకుంటే ..అవి మొలకలు రాగానే రోజుకి ఒక వెరైటీ చేసేయచ్చు .
కావలసిన పదార్థాలు
స్ప్రౌట్స్ - ఒక పెద్ద కప్పు
ఉల్లితరుగు - ఒక చిన్న కప్పు
టమాట ప్యూరీ - 4 స్పూన్స్
పెసరపప్పు - 4 స్పూన్స్
సెనగ పిండి - ఒక స్పూన్
పచ్చి కొబ్బరి - 5 స్పూన్స్
కారం - 2 స్పూన్స్
ఉప్పు - రుచి కి తగినంత
పసుపు - చిటికెడు
పెరుగు - 2 స్పూన్స్
జీలకర్ర పొడి - పావు స్పూన్
ధనియాల పొడి - అర స్పూన్
కసూరి మేతి - ఒక స్పూన్
డ్రై మాంగో పౌడర్ - అర స్పూన్
నూనె - తగినంత
ఆవాలు, జీలకర్ర - ఒక స్పూన్
తయారి విధానం
నాన పెట్టిన గింజల్ని కుక్కర్లో ఒక అయిదు విసిల్స్ వచ్చేవరకు వుంచి.. దించాలి.
ఈ లోపు వేరే బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కసూరి మేతి వేసి అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి.
ఉల్లిపాయలు వేయించి నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తె త్వరగా వేగుతాయి.
ఉల్లి పాయలు ఎర్రగా అయ్యాక అందులో టమాటా ప్యూరి వేసి కలపాలి.
అది ఒక్క ఉడుకు ఉడకగానే... అందులో ధనియాలపొడి నుంచి, పసుపు, కారం తో సహా అన్ని వేసి కలపాలి.
(కొబ్బరి ,సెనగపిండి , పెరుగు తప్ప ). అవి బాగా కలిసాక ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్, ఉప్పు, వేసి కలపాలి.
కూర ఉడకటం మొదలు కాగానే కొంచం సేపు మూత పెట్టి ఉంచాలి..అప్పుడు అన్ని రుచులు స్ప్రౌట్స్ కి పడతాయి.
దించేముందు సెనగ పిండి, పెరుగు, కొబ్బరి వేసి కలిపితే చాలు.
ఈ కూర చపాతిల లోకి బావుంటుంది. నీరు ఎక్కువగా లేకుండా చేస్తే చపాతిల మద్యన పెట్టి రోల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. కొంచం చాట్ మసాలా వేసి ...చాట్ లా తినచ్చు.
- రమ