Thotakura Garelu
తోటకూర గారెలు
కావలసినవి:
తోటకూర తరుగు - 2 కప్పులు
జీలకర్ర - 1 టీ స్పూను
ఉప్పు - తగినంత
మినప్పప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి-2
అల్లం - అంగుళం ముక్క
నూనె - సరిపడా.
తయారీ:
ముందుగా మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి చిక్కగా రుబ్బాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. రుబ్బిన పిండిలో తోటకూర, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి.తరువాత స్టవ్ పై కడాయి పెట్టి నూనె పోసి కాగాక పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని గారెల్లా వత్తి మధ్యలో కన్నం పెట్టి, నూనెలో దోరగా వేగించుకోవాలి.ఈ వేడి వేడి గారెల్ని టమోటా సాస్‌తో లేదా చట్నీ తో కాని సర్వ్ చేసుకోవాలి.