Mango Toor Dal Pickel
మామిడికాయ పెసరపప్పు పచ్చడి
కావలసినవి:
మామిడికాయ - 1
పెసరపప్పు - 1 కప్పు
మిరపకాయలు - 6
పోపు దినుసులు - తగినన్ని
ఇంగువ - చిటికెడు
పసుపు - తగినంత
ఉప్పు - కొంచెం
నూనె - కొంచెం
తయారీ విధానం:
మామిడికాయ చెక్కు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలీలో నూనె వేసి, పోపు దినుసులు వేసి వేగాక మిరపకాయలు, పెసరపప్పు వేయించి తీసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బి తీసుకుని పైన కొంచెం పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ.