Vankaya Tomato Pachadi
వంకాయ టమాటా పచ్చడి
కావలసినవి:
వంకాయలు (పెద్దవి) - 2
టమాటాలు - 4
పచ్చిమిర్చి - 4
పోపు దినుసులు - కొంచెం
నూనె - 3 స్పూన్లు
ఇంగువ - కొంచెం
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
తయారీ విధానం:
వంకాయలకు కొంచెం నూనె రాసి స్టౌ మీద మెత్తబడే వరకూ కాల్చి పక్కన పెట్టుకోవాలి. బాణలీలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించి తీయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కాల్చిన వంకాయలు నీళ్ళలో ముంచి తొక్క తీసి లోపలి గుజ్జులో మిక్సీలో రుబ్బిన ముద్ద కలపాలి. కొత్తిమీర సన్నగా తరిగి కలపాలి. చివరగా పోపు వేసి పచ్చడి మీద వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ టమాటా పచ్చడి రెడీ. ఇది చపాతీలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి... అన్నింటికీ బాగుంటుంది.