Mamidikaya Pulihora

 

 

మామిడికాయ పులిహోర

 

 

 

కావలసిన పదార్ధాలు:

పచ్చి మామిడికాయలు - 2

బియ్యం - 4 కప్పులు

శనగపప్పు - టేబుల్‌ స్పూన్‌

మినపపప్పు - టేబుల్‌ స్పూన్‌

ఆవాలు - టేబుల్‌ స్పూన్‌

పచ్చి మిర్చి - తగినన్ని

ఎండుమిర్చి - రెండు

కరివేపాకు - తగినత

పసుపు - 1 స్పూన్‌

ఉప్పు - తగినంత.

 

తయారుచేసే విధానం:

ముందుగా అన్నం కొంత బిరుసుగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలకు తొక్క తీసి ముక్కలుగా లేదా కోరి పెట్టుకోవాలి. అన్నం వేడి తగ్గినతర్వాత దాన్ని మెదిపి ఈ మామిడి కోరును లేదా చిన్న ముక్కలను అందులో కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలి వేడి చేసి శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పసుపు వేసి కలుపుకోవాలి. పోపు బాగా వేగిన తరువాత మామిడి తురుము కలిపి మెదిపిన అన్నంలో బాగా కలిసే లా గరిటెతో తిప్పాలి. తర్వాత ఉప్పు తగినంతగా కలుపుకొని సర్వ్‌ చేయాలి. పుల్లపుల్లని రుచితో నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ!