Malai Mater Paneer Recipe
మలై మటర్ పనీర్ రెసిపి
కావలసిన పదార్ధాలు:
పనీర్ : 250 గ్రాములు .
మీగడ : ఒకటిన్నర కప్పు
పెరుగు : 4 టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ : ఒకటి
ధనియాల పొడి : 1 టేబుల్ స్పూన్
ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు : ఒక బౌల్
ఆవాల పొడి : ఒకటిన్నర స్పూన్
కారం : ఒకటిన్నర స్పూన్
పసుపు : ఒకటిన్నర స్పూన్
నూనె : సరిపడా
కొత్తిమీర : సరిపడా
గరం మసాలా పొడి: కొంచం
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
పనీర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం సేపు వేగనివ్వాలి.
బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ధనియాలపొడి, పసుపు, ఉప్పు,కారం, ఆవపొడి, వేసి కలపాలి ఐదు నిమిషాల వేగనివ్వాలి. ఇందులో పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి.
తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి మూత పెట్టాలి.
స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా చివరిలో కొత్తిమిర వేసి దించేయాలి...