Rice Salads Recipes

 

 

 

మెక్సికన్‌ రైస్‌ సలాడ్‌

 

 

 

కావలిసిన పదార్థములు
క్యాప్సికమ్‌ -  మూడు (మూడు కలర్స్ తీసుకోవాలి)
ఉల్లిపాయ : ఒకటి
నిమ్మరసం : అర టీ స్పూను
మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కట్ట
బాస్మతి రైస్‌  -  ఒక కప్పు
వెనిగర్‌ : టీ స్పూన్‌

 

తయారు చేసే విధానం:
ముందుగా బియ్యాన్నిఉడికించిన చల్లార్చాలి. క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చల్లారిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో వెనిగర్‌, నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అన్ని బాగా కలిసేలా  కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచంసేపు అలాగే ఉంచాలి. తరువాత క్యాప్సికమ్‌ ముక్కల్ని కూడా అన్నంలో వేసి కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత సర్వింగ్ బౌల్  లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.

 

 

*****

 

ఫ్రెంచ్ రైస్ సలాడ్

 

 

 

కావలసినవి:
బాస్మతి బియ్యం        -   2 కప్పులు   
జీడిపప్పు                  -1 కప్పు    
వేరుసెనగపప్పు          - 1 కప్పు  
గుమ్మడిగింజలు        -1 కప్పు
ఫ్రెంచ్ బీన్స్              - పావు కాప్పు
సెలెరీ తురుము         - అరకప్పు
ఉప్పు                      - తగినంత  
మిరియాల పొడి        -   2 టీస్పూన్లు 
టొమాటో ముక్కలు     -  1 కప్పు
ఉల్లికాడల తురుము   - 1 కప్పు 

 

తయారుచేసే విధానం:
బాస్మతి బియ్యం కడిగి ఉడికించి పక్కన ఉంచాలి. జీడిపప్పు, వేరుసెరుగ పప్పు, గుమ్మడిగింజలు విడివిడిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి ( ఆయిల్ లేకుండా వేయించాలి) తరువాత కూరగాయల ముక్కలన్నీ విడివిడిగా కొద్దిసేపు వేయించి తీయాలి. తరువాత వీటిని అన్నంలో కలపాలి. ఇప్పుడు  సన్నగా తరిగిన ప్రెంచ్ బీన్స్ ముక్కలు, ఆవ మొలకలు వేసి కలపాలి. చివరిగా వేయించిన నట్స్ కూడా వేసి తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.