Stuffing Bread rolls

 

 

స్టఫ్ఫింగ్  బ్రెడ్ రోల్ల్స్

  

కావాల్సినవి:
ఆలూ  : 3
బ్రెడ్ స్లయిస్లు : 8
బఠానీలు :  50 గ్రా
ఉప్పు : తగినంత
ఉల్లిపాయలు : ఒకటి
పచ్చిమిర్చి : 3
పసుపు  : చిటికెడు
వెన్న: 100 గ్రాములు
కొత్తిమీర : అర కప్పు(కట్  చేసినది ) 

తయారు చేసే విధానం:
ముందుగా  ఆలూ ని బఠాని ని విడివిడిగా  ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని  గిన్నె పెట్టుకుని  అందులో కొంచెం వెన్న వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి  తరువాత ఉడికించి,మెత్తగా చేసిన ఆలూ గుజ్జును , ఉడికించిన బఠానీలు కూడా కలిపి, కొంచెం పసుపు,కొత్తిమీర,తగినంత ఉప్పు వేసి కలిపి  కర్రీ చేసుకోవాలి . ఇప్పుడు బ్రెడ్ స్లయిస్ చివర్లు  కట్ చేసి  వాటి పైన తయారు చేసిన ఆలూ కర్రీ ని పెట్టి  బ్రెడ్ స్లయిస్ కార్నర్ నుండి రోల్ ల్లాగా  చుట్టుకోవాలి ఇలా  అన్నిటిని రెడీ చేసిపెట్టుకోవాలి . ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ పెట్టి వెన్న వేసి, బ్రెడ్ రోల్ల్స్ఒక్కొక్కటి  వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించుకుని  తరువాత  వాటిని రౌండ్ గా కట్ చేసుకోవాలి...