kharjuram saggubiyyam kheer

 

 

 

ఖర్జూరం సగ్గుబియ్యం ఖీర్

 

 

కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం - ఒక కప్పు
 ఖర్జూరాలు - 10

యాలకుల పొడి - కొద్దిగా
జీడిపప్పు - 10
కిస్ మిస్- 5
పాలు - పావు లీటర్
నెయ్యి - 2 స్పూన్లు

 

తయారీ
ముందుగా ఖర్జురాలను నీళ్ళు  వేయకుండా మిక్సి లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత సగ్గుబియ్యం కొద్దిగానీళ్ళు వేసి ఒక గిన్నెలో వేసి ఉడికించుకుని అందులో పాలు కలుపుకుని  బాగా మరిగించి ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకోవాలి.బాగా మిక్స్ అయ్యేవరకు గిన్నెకు అంటుకోకుండా కలుపుతూ వుండాలి.ఖీర్ చిక్కగా అయ్యాక యాలకుల పొడి కలుపుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ లను కూడా వేసుకోవాలి.ఈ స్వీట్ పిల్లల్లకి, పెద్దలకు కూడా నచ్చుతుంది.
ఇందులో మనం చెక్కర కాని బెల్లం కాని వాడలేదు.