Chicken Nuggets

 

చికెన్ నగ్గెట్స్

 


 

ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీ తిని తిని బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు , ఈ నగ్గెట్స్ ఒక్కసారి తింటే చాల ఇష్టపడతారు. ఎంతో ఈజీ గ చేస్కునే ఈ చికెన్ నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం


కావలసిన పదార్ధాలు :

చికెన్ - 250 గ్రాములు

బ్రెడ్ ముక్కలు - 4

అల్లం - ½ టేబుల్ స్పూన్

వెల్లుల్లి - ½ టేబుల్ స్పూన్

మిరియాల పొడి - 1 ½ టేబుల్ స్పూన్

కారం - 1 టేబుల్ స్పూన్

నిమ్మకాయ - తగినంత

మొక్కజొన్న పిండి - ½ కప్పు

మైదాపిండి - 2 టేబుల్ స్పూన్స్

కొత్తిమీర - ఒక బౌల్ లో (తరిగినది)

నూనె - 2 కప్పులు


తయారి విధానం :

ఒక పెద్ద గిన్నె తీసుకుని, అల్లం, వెల్లుల్లి పేస్టును దానిలో వేయండి.

ఒక చెంచా ఎర్రకారం వేయండి.

అరచెంచా మిరియాల పొడి, రుచికి ఉప్పును వేయండి.

ఇప్పుడు 1 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి, నిమ్మరసం పిండండి.

ముందుగా చికెన్ ని బాగా ఉడికించి మాష్ చేసి పెట్టుకోవాలి, ఇపుడు ఈ చికెన్ ని ఇంకా ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టు 30 నిమిషాలు అలా నాననివ్వండి.

నాలుగు బ్రెడ్ ముక్కలను తీసి మిక్సీలో క్రంబ్స్ లాగా ముక్కలు చేయండి.

ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వేడిచేసిన నూనె ఉన్న పెనంలో వేయండి.

3నుంచి 4 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా కలపండి.

ప్లేట్లోకి తీసుకుని, మాములు గది ఉష్ణోగ్రతలోనే చల్లబడనివ్వండి.

ఇప్పుడు, మీడియం సైజు గిన్నె తీసుకుని అరకప్పు మొక్కజొన్న పిండిని వేయండి.

2 చెంచాల మైదాను వేసి, అరచెంచా మిరియాల పొడిని వేయండి.

చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి, గడ్డలు లేకుండా బాగా కలపండి.

ఇప్పుడు మెరినేటడ్ చికెన్ తీసుకుని, మీకు నచ్చిన షేప్ లో చేసుకుని ఈ మిశ్రమంలో ముంచండి.

తర్వాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ పొడిపై దొర్లించి, నూనెలో వేయండి.

బంగారు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగనివ్వండి.

బంగారు రంగులోకి మారాక, నూనె నుంచి తీసేసి టమాటా కెచప్ తో వేడివేడిగా వడ్డించండి.