Dosakaya Mulakkada Koora
దోసకాయ ములక్కాడ కూర..
కావలసిన పదార్ధాలు:-
దోసకాయ పెద్దది - 1
ములక్కాడ ముక్కలు - 6
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి - 4 రెబ్బలు
పచ్చి మిర్చి - 1
టమాటా - 1
మెంతికూర - 1 కట్ట
జీలకర్ర - 1/2 చెంచా
ఆవాలు - 1/4 చెంచా
పసుపు - చిటికెడు
ఉప్పు - 1/2 చెంచా
కారం - కొద్దిగా
కరివేపాకు, కొత్తిమీర - సువాసనకు తగినంత
తయారీ విధానం:
* ముందుగా పొయ్యి మీద మూకుడుపెట్టి నూనె వేసి... జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిరపముక్కలు నిలువుగా తరిగిన ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయిస్తూ ఉల్లి ముక్కలు వెయ్యాలి.
* అవి కాస్త వేగాక టమాటా ముక్కలు వేసి వేయించి... ముక్కలుగా తరిగిన దోసముక్కలు, ములక్కాడలు వేసి ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
* కమ్మని దోసముక్కలు వాసన వస్తున్నప్పుడు కొద్దిగా నీరుపోసి ములక్కాడ ముక్కలు ఉడికించుకోవాలి. ఈ దశలో మరింత పులుసు కావాలంటే చింతపండు రసంతో ఉడికించుకోవాలి.
* చేదులేని దోస గింజలు కూడా ఈ కూరలో కలిపితే బావుంటుంది.
* ఈ కూర త్వరగా ఉడుకుతుంది ౩ వంతుల భాగం ఉడికాక కడిగి, తరిగి శుభ్ర పరచిన మెంతి ఆకులు పైన వేసి మూతపెట్టి కారం పొడి జల్లి పొయ్యి మీద నుండి దింపి కొత్తిమీర కాస్త వెన్న వేసి కలుపుకోవాలి.
* మరీ నీళ్ళలాఉంటే కాస్త పిండి పెట్టుకోవచ్చు. ఈ కూర చాలా చాలా బావుంటుంది. ఉత్తినే తినేలా ఉంటుంది. దీనిని చపాతీ అన్నం గోధుమరవ్వ ఉప్మా అన్నింటిల్లోకి ఆధరువు.