దహీ బ్రెడ్ వడ!
దహీ బ్రెడ్ వడ!
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ప్యాకెట్ - ఒకటి
పెరుగు - అరలీటరు
నూనె - సరిపడా
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - చిన్నముక్క
ఉప్పు - తగినంత
జీలకర్రపొడి - అరటీస్పూను
కారం - అరటీస్పూను
తయారుచేసే విధానం:
ముందుగా బ్రెడ్ ముక్కలను మెత్తగా చేసుకుని కొద్దిగా నీళ్లు వేసి తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్దలా కలపాలి.
తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగాక బ్రెడ్ మిశ్రమం ను చిన్నచిన్న ఉండలు తీసుకుని వడలుగా వత్తిన నూనెలో వేసి వేయించి బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలిపి వేయించిన వడను పెరుగులో వేసి కాసేపు నానాక సర్వ్ చేసుకోవాలి...