Corn Flakes Chat
కార్న్ ఫ్లేక్స్ చాట్
కావలసిన పదార్థాలు:
కార్న్ ఫ్లేక్స్ - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
ఉడికించిన బంగాళాదుంప - ఒకటి
పచ్చి మామిడి ముక్కలు - పావుకప్పు
మరమరాలు - మూడు కప్పులు
కొత్తిమీర పేస్ట్ - రెండు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
పండు మిరపకాయ - ఒకటి
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
పండు మిరపకాయను సన్నగా తరగాలి. పండు మిరపకాయ దొరక్కపోతే పచ్చి మిరపకాయ వేసుకున్నా ఫర్వాలేదు. బంగాళాదుంపను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయను కూడా బాగా చిన్నగా తరగాలి. ఓ బౌల్ లో మరమరాలు వేసి మెత్తగా చిదమాలి. ఆ తరువాత మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి ఆరగించాలి. కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అలాగే దానిమ్మ గింజలు, వేరుశనగలు వంటివి వేసుకున్నా బాగుంటుంది.
- Sameera