Chiru Dhanyalu Tho Dosha
చిరు ధాన్యాలతో దోశ
కావలసినపదార్ధాలు :
రాగి, కొర్రలు (మిల్లెట్స్), జొన్న, సజ్జలు, బార్లీ అన్ని కలిపి - 1 కప్పు
మినపప్పు - 1 కప్పు
బియ్యం- 2 కప్పులు
ఉప్పు - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
నూనె - సరిపడినంత
తయారు చేయు విధానం:
మల్టీ గ్రైన్ ప్యాకెట్లు బజారులో కూడా దొరుకుతాయి.. ఆ రవ్వ అయినా 1 కప్పు నానబెట్టుకుకోవచ్చు.
ఇవ్వన్నీ 4 గం" పాటు నానబెట్టుకుని మినప్పప్పు, బియ్యం, అన్ని కలిపి మెంతులతో సహా రుబ్బుకోవాలి.
రుబ్బిన పిండిని 6 గం" పాటు అలా ఉంచితే కాస్త పులుస్తుంది. దానిలో ఉప్పు వేసి పెనంపై నూనెరాసి దోశల్లా వేసుకోవాలి.
ఇవి కాస్తా కోరా రంగు నుంచి గోధుమ రంగులో వస్తాయి. పైన క్యారెట్ తురుము, ఉల్లి పొట్టు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసి తయారుచేసుకుంటే చాలా బావుంటాయి.
వీటిలోకి టమాటా పచ్చడి, కొత్తిమీర, అల్లం ఏ పచ్చడిఅయినా బావుంటుంది... ఈ దోషాలు వేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యానికి ఎంతో మంచివి ఈ దోశలు...
- భారతి