Pappula Idli

 

 

 

పప్పుల ఇడ్లీ

 

 

కావలసినపదార్ధాలు :

మినపప్పు -  1 కప్పు

పెసరపప్పు - 1 కప్పు

పొట్టుమినపప్పు - 3 చెంచాలు 

ఉప్పు - కొద్దిగా

 

తయారు చేయు విధానం:

మినపప్పు , పెసరప్పప్పు కడిగి శుభ్రం చేసుకొని విడివిడిగా 3 నుంచి 4  గంటలపాటు నానబెట్టుకోవాలి. మినపప్పులోనే పొట్టుమినపప్పు కలపాలి ఇది పై తొక్కలోని.. పీచు పదార్థంకోసము. తరువాత మెత్తగా రుబ్బుకోవాలి.. విడివిడిగా రుబ్బుకుని ఉప్పు కలిపి రెండు పిండిలను బాగా కలిపి 3 గం" నాననివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లపై నూనె రాసి.. ఈ పిండిని ఇడ్లీలా వేసుకోవాలి... 20 ని'' ఆవిరిపై ఉడికించుకొని.. చల్లారనిచ్చి ప్లేట్లల్లో చట్నీ (లేదా) సాంబారుతో వడ్డించాలి. చాలారుచిగా ఉంటాయి.. బియ్యం, ఇడ్లీరవ్వ ఏమీ కలుపనక్కరలేదు. చాలాసులువుగా తయారు చేసుకోవచ్చు.. చాలా కమ్మగా ఉంటాయి కూడా.

 

- భారతి