Chicken Sindhi Murg & Murg Tikka Kabab

 

 

 

 Chicken Sindhi Murg & Murg Tikka Kabab

చికెన్ సింధీ ముర్గ్

 

 

 

కావలసినవి :

చికెన్

పెరుగు

టమాట క్యూరి

పసుపు

గసాల పేస్ట్

డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్

అల్లం వెల్లుల్లి పేస్ట్

మిరియాల పొడి

జిలకర పొడి

గరం మసాల పొడి

పుదీనా పేస్ట్

లవంగాల పొడి

ఉప్పు

ధనియాల పొడి
కారం

పుదీనా

నెయ్యి

 

తయారీ  :

ముందుగా చికెన్ లో నీళ్ళు లేని పెరుగు, కారం, పసుపు, గరం మసాల పొడి, ఉప్పు కలిపి మారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకో గిన్నె తీసుకుని అందులో టమాట ప్యూరి, గసాల పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాల పొడి, ఉల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, జిలకర పొడి, మిరియాల పొడి, పుదీనా పేస్ట్, టమాట ప్యూరీ, గరం మసాల ( optional) , వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరవాత స్టవ్ బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి అందులో , అంతకు ముందే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి అందులోని నీరు పూర్తిగా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి . ఆ తరవాత టమాటా ప్యూరి తో పాటు కలిపి పెట్టుకున్న మసాల మిశ్రమాన్ని దానితో బాటు కాస్త ఉప్పు వేసి కాస్త నీరు పోసి ఉడకనిస్తే ఘుమఘుమలాడే సింధీముర్గ్ రెడీ అయినట్టే.  

 

********

 

ముర్గ్ చికెన్ తీక కబాబ్

 

 

 

కావలసినవి :

బోన్ లెస్ చికెన్

పెరుగు

కారం పొడి

ఆమ్చూర్ పౌడర్

జిలకర పౌడర్

ధనియాల పౌడర్

మిరియాలపొడి

యాలకులపొడి

నిమ్మరసం

నెయ్యి కలిపి చేసుకున్న సాస్

నిమ్మరసం

బ్లాక్ సాల్ట్

టమాట కెచప్

కొత్తిమీర

 

తయారీ  :

ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో కాస్త నిమ్మరసం , టమాట కెచప్, కాస్త బ్లాక్ సాల్ట్, సాల్ట్ వేసి కలిపి చికెన్ ముక్కలను స్టీవర్స్ కి గుచ్చి వీడియోలో చూపిన విధంగా కాల్చుకోవాలి. ఆ తరవాత కాలిన చికెన్ పై బేస్టింగ్ సాస్ అప్లై చేసి ఒవెన్ లో పెట్టాలి. అలా తయారైన కబాబ్ ని కొత్తిమీర, ఉల్లిగడ్డలు, టమాట కెచప్ తో సర్వ్ చేసుకోవచ్చు.