Cauliflower Paneer Curry
కాలీఫ్లవర్ పనీర్ కర్రీ
కావలసినవి :
కాలీఫ్లవర్ - ఒకటి
పనీర్ – 100 గ్రాములు
జీడి పప్పు – 25 గ్రాములు
పచ్చి బఠాణీలు – రెండు టేబుల్ స్పూన్లు
టమోటో సాస్ – రెండు టీ స్పూన్లు
పంచదార – కొద్దిగా
ఉప్పు – తగినంత
కొత్తిమీర తురుము – అర కప్పు
నూనె – సరిపడా
తయారీ :
ముందుగా నీటిలో పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. తరువాత పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పంచదార వెయ్యాలి. పంచదార బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. ఇందులో మసాలా పేస్టు, ఉడికించుకున్న కాలీ ఫ్లవర్ ముక్కలు, బఠాణీలు వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. తర్వాత పనీర్, జీడిపప్పు, పెరుగు, ఓ కప్పు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి. కాలీఫ్లవర్ ముక్కలు బాగా మెత్తపడ్డాక జీలకర్ర పొడి, టమాటో సాస్ వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి చివరిలో కొత్తిమీర వేసి రైస్ తో కాని చపాతితో కాని వేడి వేడి గ సర్వ్ చేసుకోవాలి.