Kerala Special Theeyal
కేరళ స్పెషల్ తెయ్యాల్
కావలసినవి :
వంకాయలు - 4
చిన్న ఉల్లిపాయి - 10
తురిమిన కొబ్బరి - 1కప్పు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
కొబ్బరినూనె - 3టేబుల్ స్పూన్
మిరియాల పొడి - ½ టేబుల్ స్పూన్
చింతపండు గుజ్జు – రెండుస్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఎండు మిరపకాయలు - రెండు
పసుపుపొడి - ½ టేబుల్ స్పూన్
తయారీ :
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ నూనె వేసి కాగాక తురిమిన కొబ్బరినివేసి అది బ్రౌన్ కలర్ లోకి మారిన తరువాత, మెంతులు వేసి కలిపి ఇప్పుడు ధనియాల పొడి, మిర్చి పొడి, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి కొన్ని చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిశ్రమం బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాకా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి వంకాయ ముక్కలు మిగిలిన చిన్న ఉల్లిపాయలను కొద్దిసేపు వేగనిచ్చి ఐదు నిముషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జులో కొద్దిగా నీటిని కలిపి ఈ నీటిని వేయించిన వంకాయ ముక్కల్లో వేసి కలిపి ముందుగా తయారుచేసుకున్నమసాలా పేస్ట్ , ఉప్పు కూడా వేసి పది నిముషాలు ఉడకనిచ్చి గ్రేవి చిక్కగా పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి నున్నే పోసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు వేసి పోపు వెయ్యాలి. అంతే కేరళ స్పెషల్ తెయ్యాల్ రెడీ