Cauliflower masala fry recipe
కాలిఫ్లవర్ మసాలా ఫ్రై
కావలసినవి:
కాలి ఫ్లవర్ - ఒకటి
జీలకర్ర పొడి - ఒక స్పూన్
ధనియాలపొడి - ఒక స్పూన్
టమోటాలు - నాలుగు
అల్లంవెల్లుల్లి - ఒక స్పూన్
మెంతికూరపొడి - అర స్పూన్
కారం - ఒకటిన్నర స్పూన్లు
నెయ్యి- తగినంత
ఉప్పు - తగినంత
కొత్తి మీర- 1కట్ట
తయారు చేసే విధానం:
ముందుగా కాలి ఫ్లవర్ ను కట్ చేసుకుని నీటిలో వేసి ఉప్పు కలిపి మెత్త బడే వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి కాలిఫ్లవర్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గాక అందులో నెయ్యి వేసి కలిపి కొన్ని నిమిషాలు ఉడికించాలి.ఇప్పుడు ధనియాల పొడి,గరం మసాల,జీలకర్ర పొడి,ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఐదు నిముషాలు ఆగి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి. సింపుల్ & టేస్టీ ఫ్రై రెడీ