Carrot Dosa

 

 

 

 క్యారెట్‌ దోశ 

 

 

 

 

కావలసినవి:
క్యారెట్‌ - 2
ఉల్లిపాయలు - 1
దోశలపిండి -  తగినంత
పచ్చిమిర్చి- 4
కారం - అర స్పూన్
కొబ్బరిపొడి - 2  స్పూన్లు
బేకింగ్‌ సోడా - చిటికెడు
గరం మసాలా - అరస్పూన్
ఉప్పు - తగినంత
నెయ్యి - తగినంత

 

తయారుచేసే పద్ధతి
ముందుగా క్యారెట్‌ని సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి.తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీటికి గరం మసాలా,  ఉప్పు, కొబ్బరి పొడి,  కారం, బేకింగ్‌ సోడా కలిపి  ఈ మిశ్రమాన్ని దోశల పిండిలో  బాగా కలిపి స్టవ్ వెలిగించి పెనం పెట్టి దోశ వేసి పైన నెయ్యి వేసి రెండు వైపులా కాలాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి...