Carrot Vada

 

 

క్యారెట్  వడ

 

 

 

కావలసినవి:

క్యారెట్‌ తురుము- ఒక కప్పు
కరివేపాకు- రెండు రెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
పుదీనా- కొద్దిగా
ఉప్పు- -సరిపడినంత
నూనె-  సరిపడ
వెల్లుల్లి రేకులు- నాలుగు
గరం మసాలా- చిటికెడు
సెనగపప్పు- ఒక కప్పు
ఉల్లిపాయ -1

 

తయారీ:
ముందుగా సెనగ పప్పు రెండుగంటలపాటు నీటిలో నానపెట్టుకోవాలి. దీనికి వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్‌ తురుము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా, ఉప్పు వేసి కలపాలి. తరువాత గిన్నెపెట్టి నూనె పోసి వేడి చేసి కలిపి ఉంచుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా  పిండిని తీసుకుని వడలు చేసుకుని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గ్రీన్ చట్నీ తో కాని సాస్ తో కాని సర్వ్ చేసుకోవాలి...