Capsicum Special curry

 

 

 

క్యాప్సికం స్పెషల్ కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు:

క్యాప్సికం: 5

ఉల్లిపాయలు: పెద్దది ఒకటి

కారం: టీ స్పూన్

నువ్వులు: 100 గ్రాములు

పచ్చిమిర్చి: 5

టమోటో: 2

ఆవాలు : టీ స్పూన్

మెంతులు: చిటికెడు

ధనియాలు: 1టీ స్పూన్

వేరుశెనగుళ్ళు: 50 గ్రాములు

కొబ్బరి తురుము: హాఫ్ కప్

కొత్తిమీర: కొద్దిగా

చింతపండు: సరిపడా

ఉప్పు: తగినంత

నూనె: సరిపడా

 

తయారు చేయు విధానం:

* ఒక పాత్రని తీసుకుని స్టౌ మీద పెట్టి వేరుశెనగలు, నువ్వులు,ధనియాలు, కొబ్బరి వేసి వేయించి తీసి పక్కన తీసి పెట్టుకోవాలి.

* ఇవి చల్లారాక మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి.

* స్టౌ పై పాన్ పెట్టి అందులో నూనె వేసి మెంతులు, ఆవాలు వేయించాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి వేయించాలి.

* ఉల్లిపాయలు కొంచం బ్రౌనిష్ వచ్చాక క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి. క్యాప్సికం ఫ్రై అయిన తరువాత అందులో రెడీ చేసి పెట్టుకున్నవేరుశెనగ మసాల పేస్ట్ ను వేసి కొద్దిసేపు వేయించుకొవాలి.

* ఇప్పుడు టమోటోముక్కలు, కారం, ఉప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత నానబెట్టి పెట్టుకొన్నచింతపండు రసం అందులో వేసి, అది కొంచెం చిక్కగా అయ్యేవరకు వుంచాలి. ఇప్పుడు కొత్తిమిర వేసి దించేయ్యాలి... రోటి తో కానీ రైస్ తో కానీ సర్వ్ చెయ్యొచ్చు...