Capsicum Mushroom Curry

 

 

 

క్యాప్సికం మష్రూమ్స్‌ కర్రీ

 

 

 

కావలసినవి :
క్యాప్పికం -2
మష్రూమ్స్ - 10
ఆలూ - 2
ఉప్పు - తగినంత
కారం - ఒక స్పూను.
కొత్తిమీర -  తగినంత
కరివేపాకు - 2 రెబ్బలు
జీలకర్ర - ఒక స్పూన్
ఆవాలు - 1 టీ స్పూన్
నూనె - సరిపడా

 

తయారీ :

 

ముందుగా మష్రూమ్స్‌తో పాటు ఆలూ, క్యాప్సికంలను శుభ్రం చేసి అరంగుళం ముక్కలుగా తరగాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్  పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేగించి ఆలూ ముక్కలు వేసి వేగాకా మష్రూమ్స్, క్యాప్సికం ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి తరువాత ఉప్పు, కారం సరిపడా నీళ్ళు పోసి  మూత పెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి. పది  నిముషాలు ఉడకాక నీరు మొత్తం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు  స్టవ్ ఆఫ్ చేసి  కొత్తిమీర చల్లి రైస్ తో సర్వ్ చేసుకోవాలి...