Capsicum Masala Rice

 

క్యాప్సికమ్ మసాలా రైస్

 

  

కావలసిన పదార్ధాలు:

క్యాప్సికమ్ - 2

బియ్యం - 250 గ్రాములు

నెయ్యి - 3 స్పూన్స్

ఆవాలు - 1 స్పూన్

కరివేపాకు - సరిపడా

ఉప్పు - తగినంత

ఎండుమిర్చి - 3

ధనియాలు - ఒక స్పూన్

జీలకర్ర - ఒక స్పూన్

మినప్పప్పు - ఒక స్పూన్

దాల్చిన చెక్క - చిన్న ముక్క

వేరుశనగపప్పు - అరకప్పు

నెయ్యి - 100 గ్రాములు

 

తయారు చేయు విధానము:

ముందుగా బియ్యం కడిగి అన్నం కుక్కర్లో ఉడికించుకోవాలి.

 

తరువాత దానిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

 

ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక వేరుశెనగుళ్ళు, మినప్పప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తర్వాత వేగాక పక్కకు తీసి గ్రైండ్ చేసుకోవాలి.

 

ఇప్పుడు వండుకున్నరైస్ లో పొడి కలపాలి.

 

తరువాత పాన్ లో నెయ్యి వేసి కరిగాకా ఆవాలు, కరివేపాకు వేసి క్యాప్సికం ముక్కలు వేసి వేయించి సరిపడా ఉప్పు వేసుకుని కలపాలి.

 

ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుని కలపాలి పైన కొంచం నెయ్యి వేసుకోవాలి.