Butter Paneer Masala
బటర్ పనీర్ మసాలా
కావలసినవి:
పనీర్ - పావుకేజీ
టమాటా - నాలుగు
పుదీనా - కొద్దిగా
గరంమసాలా -ఒక స్పూను
ఎండు మిరపకాయలు - ఐదు
ఉల్లిపాయలు - మూడు
జీడిపప్పు - కొద్దిగా
అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను
మెంతికూర - రెండు కట్టలు
రెడ్ ఆరంజ్ కలర్ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
వెన్న - ఒక కప్పు
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా పనీర్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. తర్వాత టమాటాలు, గరంమసాలా, ఎండు మిరపకాయలు, పుదీనా, మెంతికూర, ఉల్లిపాయలను ముక్కలుగా కోసి కలిపి, కొంచెం ఉప్పు కూడా వేసి స్టౌమీద పెట్టి ఉడికించాలి. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి, దానికి అల్లం, వెల్లుల్లి ముద్దను కలిపి వేయించాలి. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా రసాన్ని కొంచెం కొంచెం వేస్తూ, నూనె తేలేవరకూ ఫ్రై చేస్తే గ్రేవీ తయారవుతుంది. గ్రేవీకి రెడ్ ఆరంజ్ కలర్ కలిపి, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసిన పనీర్ ముక్కల్ని గ్రేవీలో కలిపి, పదినిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. తరువాత వెన్న కలిపి దించి, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన జల్లాలి. అంతే ఎంతో రుచికరమైన బటర్ పనీర్ మసాలా రెడీ.