Brinjal Rice

 

 

బ్రింజాల్ రైస్ 

 

వంకాయ కూర అనగానే పిల్లలు మొహం చిట్లిస్తారు ...అదిగో అలాంటప్పుడు ఇలా రైస్ ఐటమ్ చేసి పెడితే ..ఇష్టం గా తింటారు ..చేయటం కూడా చాలా సులువే ..


కావాల్సిన పదార్దాలు:-

వంకాయ ముక్కలు - ఒక కప్పు

ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

వేరుసెనగగుళ్ళు - తగినన్ని

మినపప్పు - ఒక చెంచా

జీలకర్ర -  కొద్దిగా

నూనె -  తగినంత

కొబ్బరి కోరు - రెండు చెంచాలు

నువ్వులు - కొద్దిగా

గసగసాలు - ఒక చెంచా

మెంతులు - అర చెంచా

వాము - కొద్దిగా

ఎండుమిరపకాయలు - తగినన్ని

పసుపు -  చిటికెడు

ఉప్పు - తగినంత

దనియాల పొడి - కొద్దిగా

చింతపండు రసం -  కొద్దిగా

కొత్తిమీర - కొద్దిగా

ఉడికించి ఉంచిన అన్నం - ఒక కప్పు 

 

తయారుచేయు విధానం:-

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేరుసెనగ గుళ్ళు,  మెంతులు,  మినపప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, నువ్వులు,  గసగసాలు, ఎండుమిరపకాయలు తగినన్ని వేసి వేయించాలి. కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. అన్నింటిని వేయించిన తర్వాత చల్లార్చి మిక్సి వేయాలి. ఇప్పుడు మరో బాణలి లో వంకాయ ముక్కలు వేయించడానికి సరిపడ నూనె తీసుకుని, వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవగింజలు, సన్నగా తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ జోడించి.... తర్వాత వంకాయ ముక్కలు (ఒక గ్లాస్ బియ్యానికి సరిపడ వంకాయ ముక్కలు తీసుకోవాలి).వేయాలి. తర్వాత ఉప్పును, తరిగిన పచ్చి కొబ్బరి, దనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సి వేసి ఉంచుకున్న పొడిని కలపాలి. చిక్కగా రసం తీసి ఉంచిన చింతపండు రసం కలపాలి. తర్వాత దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైసు ను కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఆఖరులో నెయ్యి వేస్తే రుచిగా వుంటుంది . సింపుల్ గా ఇలా బ్రింజాల్ రైస్ చేసుకోవచ్చు. 

టిప్ : బ్రింజాల్ రైస్ కి కావలసిన పొడి ని ఒక్కసారే చేసి , డబ్బాలో నిల్వ పెట్టు కోవచ్చు ..సమయం ఆదా అవుతుంది .  https://www.youtube.com/watch?v=5vb3NjEw1BA

-Bharathi