Beetroot Curry recipe

 

 

 

బీట్ రూట్ కర్రీ రెసిపీ

 

 

 

కావలసినవి:
బీట్‌రూట్‌ : పావుకేజీ
ఉల్లిపాయలు : పావుకేజీ
ఎండు కొబ్బరి తురుము : పావు కప్పు
ఎండుమిర్చి : రెండు
కరివేపాకు : కొద్దిగా,
ఉప్పు : తగినత
పసుపు : చిటికెడు
నూనె : సరిపడా
గసగసాలు : ఒక స్పూన్

 

తయారీ విధానం:
ముందుగా  బీట్‌ రూట్‌ని శుభ్రంగా కడిగి గిన్నెలో  నీళ్ళు పోసి  ఉడికించుకోవాలి. బీట్రూట్ ఉడికిపోయాక దానిపై చెక్కు తీసి  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత  స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి  వేగిన తరువాత పసుపు, ఉప్పు వేసి రెండు నిముషాలు ఆగి ఒక  గ్లాసు నీళ్ళు పోసి  మరగనివ్వాలి తరువాత  బీట్‌రూట్‌ ముక్కలు వేయాలి. తరువాత గసగసాల పేస్ట్ వేసుకోవాలి. కొంచం చిక్క బడ్డకా  కొబ్బరి తురుము వేసుకుని ఐదు నిముషాలు ఉడికించుకుని  స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ కర్రీ వేడి వేడి రైస్ తీసుకుంటే చాలా బావుంటుంది