ఆనియన్ పరోటా
ఆనియన్ పరోటా
కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు -4
గోధుమపిండి - 2కప్పులు
కొత్తిమీర -తగినంత
జీలకర్ర- అరస్పూన్
కసూరి మేతీ- స్పూన్
ధనియాలు- అరస్పూన్
కారంపొడి-అరస్పూన్
గరం మసాలా-పావుస్పూన్
నూనె -తగినంత
ఉప్పు -రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోని..అందులో ఉప్పు వేసి పావుగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమపిండిలో ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా పిండిలా కలుపుకోవాలి. దీనికి ఒక స్పూపన్ నూనె కలిపి పావు గంట పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి..తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను గట్టిగా పిండేసి నీళ్లు తీసేయాలి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ధణియాలు, జీలకర్రపొడి, కారం, ఉప్పు, గరం మసాలా, కసూపరీ మేతి వేసి కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండిని చిన్న ఉండల్లాగా చేసుకుని మధ్య ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి అన్ని అంచులు మూసేసి పరోటాలా మందంగా ఒత్తికోవాలి. పెనం మీద నూనె వేసి పరోటాలను బంగారు రంగ వచ్చేంత వరకు కాల్చాలి. రెండు వైపు కాల్చుకోవాలి. అంతే వేడి క్రిస్పీ స్పైసీ పరోటా రెడీ.