Aratikaya Ava Kura

 

 

అరటికాయ ఆవకూర 

 


కావలసిన పదార్దాలు : 

* అరటికాయలు            - 2

* మిర్చి ఆకుపచ్చవి       - ౩ 

* అల్లం                        - చిన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా 

* చింతపండు రసం        - రుచికి తగినంత 

* ఉప్పు                        - 1/2 చెంచాలు

* పసుపు                     - చిటికెడు 

* ఇంగువ

* పోపుగింజలు 

* తాలింపుకు నూనె 

 

తయారు చేసే విధానం:

* ముందుగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేసిన అరటికాయలను ప్రక్కన ఉంచుకోవాలి.

* ఆ తరువాత మూకుడులో నూనె వేసి తాలింపు దినుసులు వేసి మిర్చి, అల్లం, కరివేపాకు వేసి ఇష్టమైతే ఇంగువ కూడా జోడించి వేయించుకోవాలి.  * పోపు వేగాక అరటికాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, చింతపండు రసం జోడించి మూతపెట్టి  5 నిమిషాలు ఉడికించుకోవాలి. 

* కూర బాగా కలిపి ఆవపొడి లేక ఆవముద్ద కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తరువాత ఆవపొడితో కూరను బాగాకలుపుకుని....అన్నంతో  తినాలి చాలారుచిగా ఉంటుంది.