Aloo Palak Pulao Recipe
పాలక్ పొటాటో పలావ్
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
పాలకూర - రెండు కట్టలు
బంగాళా దుంపలు - రెండు
క్యారెట్ - రెండు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
అల్లం వెల్లుల్లి స్ట్ - రెండు స్పూన్లు
గరంమసాలా - ఒక స్పూను
నూనె, కారం, ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
లవంగాలు, యాలకులు - కొద్దిగా
తయారుచేసే విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత బంగాళా దుంపలు, క్యారెట్‌ను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పాలకూర, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె పోసి వేడయ్యాక మసాలా దినుసులు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పాలకూర, పొటాటో, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులోనే చిటికెడు పసుపు, కారం, గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరిగిన తర్వాత బియ్యం, తగినంత ఉప్పు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత క్రిందికి దింపుకొని ఆవిరి అంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాలక్ పొటాటో పలావ్ రెడీ.