ఆలు దమ్ బిర్యానీ
ఆలు దమ్ బిర్యానీ!
కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం -2 కప్పులు
ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
పచ్చిమిరపకాయలు - 2
కొత్తిమీర- 1 కప్పు
పుదీనా - కావాల్సినంత
కుంకుమ పువ్వు - పాలలో నానబెట్టింది నాలుగు రెమ్మలు
నెయ్యి- 3 టేబుల్ స్పూన్స్
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 2
దాల్చిన చెక్క - రెండు అంగుళాలు
లవంగాలు - 4
జీలకర్ర - పావు టీస్పూన్
బిర్యానీపువ్వు
బంగాళదుంపలు - 400గ్రాములు
ఎర్రకారంపొడి - 1/2 టేబుల్ స్పూన్
పసుపు
అల్లం
వెల్లులి
బిర్యానీ మసాలా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను, ఉల్లిపాయలను బంగారు రంగు వరకు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పెరుగు, కారం,ఉప్పు,పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, ఉప్పు, బిర్యానీ మసాలా అన్ని కలిపి అందులో వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను వేయండి. అలా అరగంటసేపు మారినేషన్ చేయండి. ఈ లోపు అరగంటసేపు నానపెట్టి కడిని బియ్యం లో కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, ఉప్పు వేసి 90శాతం ఉడకినివ్వండి. ఇప్పుడు ఆ రైస్ తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బిర్యానీ కుండలో నెయ్యి వేసి వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేయండి. తర్వాత పెరుగుతో మారినేట్ చేసిన బంగాళదుంపలను వేసి ఉడికించండి. ఈ లోపు మరో స్టౌ పై దమ్ ప్రాసెస్ కోసం తావు వేడి చేసి..ఒక రైస్ ఒక లేయర్ ఉడికించిన బంగాళదుంప గ్రేవీ ఒక లేయర్ పర్చండి. గార్నింగ్ కోసం కుంకుమ పువ్వు పాలు పోయాలి. గాలి చొరబడి మూతతో అంచుని మూయండి. తర్వాత ఆ కుండను పక్కన వేడి చేసుకున్న తవా మీద పెట్టి 10 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించండి. అంతే ఆలు కా దమ్ బిర్యానీ రెడీ.