సాబుదాన టిక్కీ

 

 

సాబుదాన టిక్కీ

సాబుదాన టిక్కీ అనేది పండుగల సమయంలో చేసే వంటకం. దీన్ని పిల్లు పెద్దలు అంతా ఇష్టపడతారు.

కావలసిన పదార్థాలు:

సగ్గుబియ్యం (సాబుదాన)-250 గ్రా

ఉడికించిన బంగాళాదుంప -100 గ్రాముల

వేరుశెనగ పొడి-50 గ్రాముల

 సన్నగా తరిగిన అల్లం  -10 గ్రాముల

సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 10 గ్రాములు

కొత్తిమీర -10 గ్రాముల

జీలకర్ర పొడి -5 గ్రాముల

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - చిటికెడు

దేశీ నెయ్యి లేదా సన్ ఫ్లవర్ ఆయిల్

తయారీ విధానం:

సగ్గుబియ్యంను పెద్ద గిన్నెలో కనీసం అరగంట నానబెట్టి, ఆపై సగ్గుబియ్యంను సుబ్రంగా కడిగి నీటి నుంచి వేరు చేసి పక్కన పెట్టండి.. మరో పెద్ద గిన్నె తీసుకుని అందులో ఉడికించి తురిమిన బంగాళదుంప వేసి అందులో శనగపప్పు, అల్లం, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఉప్పు, ఎండుమిర్చి వేసి చేతితో బాగా కలపండి. ఇప్పుడు ఈ ముద్దను ఇడ్లీ తరహాలో చిన్న చిన్న మందపాటి టిక్కీలుగా సిద్ధం చేసుకోండి. మీడియం వేడి తవా మీద కాస్త నూనె లేదా నెయ్యి పోసి సాబుదానా టిక్కీ కాల్చండి. టిక్కీలు ఒకవైపు బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత మరో వైపు తిప్పండి. మళ్లీ నూనె పోసి రెండు వైపులా బంగారు రంగులోకి, క్రిస్ప్‌గా అయ్యే వరకూ వేయించాలి. చివరగా, మీకు నచ్చిన చట్నీతో సగ్గుబియ్యం టిక్కీలను సర్వ్ చేయండి.