Vankaya Ullikaram Curry
వంకాయ ఉల్లికారం కర్రీ
కావలసినవి:
వంకాయలు : పావు కేజీ
ఉల్లిపాయలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ధనియాలు - ఒక స్పూన్
జీరకర్ర - ఒక స్పూన్
నూనె- తగినంత
పసుపు - చిటికెడు
ఉప్పు- తగినంత
ఎండుమిరపకాయలు : ఎనిమిది
తయారీ :
ముందుగా పాన్ లో ధనియాలు జీరకర్ర వేసుకొని కొంచం వేగాక పక్కన పెట్టుకుని అదే పాన్ లో నూనె వేసి మిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వాలి, అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కాస్త పసుపు వేసి ఉప్పు అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరవాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో కాస్త నూనె వేసి వంకాయ ముక్కల్ని వేసి వేగనివ్వాలి. కాస్త వేగాక అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్ స్టఫ్ఫింగ్ చేసి మళ్ళి వేగనివ్వాలి. పది నిమిషాలు వేయించి బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లుకొని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.