Masala Rava Idli

 

మసాలా  రవ్వ ఇడ్లీ

 

 

కావలసిన పదార్థాలు :

బొంబాయి రవ్వ - 200 గ్రాములు

పసుపు - కొద్దిగా

దనియాల పొడి - కొద్దిగా

ఆలూ - 3

పెరుగు - ఒక కప్పు

ఆవాలు - కొద్దిగా

కరివేపాకు - రెండు రెమ్మలు

నూనె - సరిపడా

ఉప్పు - కొద్దిగా

పచ్చి బఠానీ - ఒక కప్పు

కారం - కొద్దిగా

 

తయారీ విధానం :

ముందుగా  పెరుగులో బొంబాయి రవ్వ, ఉప్పు వేసి పిండిలా కలిపి నానపెట్టుకోవాలి.

 

ఇప్పుడు బఠానీలు, ఆలూని విడి విడిగా ఉడికించాలి తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె  వేసి ఆవాలు, కరివేపాకు ఉడికించి మెత్తగా చేసుకున్న అలూ పేస్ట్ బఠానీలు, మిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, వేసి కలిపి ఒక పది నిముషాలు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

 

ఇప్పుడు నానపెట్టుకున్న ఇడ్లి పిండిని తీసుకుని  ఇడ్లీ స్టాండ్ కీ కొద్దిగా నూనె రాసి రెడీ చేసి పెట్టుకున్న ఆలూ కూరను కొద్దిగా వేసి పైన ఒక లేయర్ ఇడ్లీ పిండి వెయ్యాలి.

 

ఇలా  అన్నీ వేసుకుని ఇడ్లీ పాత్రలో   సరిపడా నీళ్ళు పోసి ఇడ్లి స్టాండ్ ను ఇడ్లీ పాత్రలో పెట్టి  స్టవ్ మీద పెట్టి ఆవిరి వచ్చె వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీలను ఒక బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి...