Katte Pongali (Dasara special)
కట్టె పొంగలి
(దసరా స్పెషల్)
హిందువుల పండుగల్లో దసరా ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేసి దేవికి నైవేద్యంగా పెడతారు. వాటిలో కట్టెపొంగలి ఎలా తయారు చేస్తారో చూద్దాం.
కావలసిన పదార్ధాలు..
* పెసరపప్పు - 2 కప్పులు
* మిరియాలు - ఒక కప్పు
* జీలకర్ర - 1/2 కప్పు
* కరివేపాకు
* ఉప్పు - తగినంత,
* నెయ్యి - 4 స్పూన్స్,
* నూనె - 3 స్పూన్స్
* ఇంగువ - చిటికెడు
* పచ్చిమిర్చి - 5
తయారు చేయు విధానం:
* ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
* ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, సగం నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి.
* ఇందులో తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం, పప్పు నీళ్లనుండి తీసి వేసి మెత్తగా ఉడికించాలి. చివరిలో మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి.