Green Peas Masala Curry

 

 

 

గ్రీన్ పీస్ మసాలా కర్రీ

 

 

 

కావలసినవి

పచ్చిబఠానిలు : కప్పు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
కరివేపాకు : కొద్దిగా
కొబ్బరి పొడి : 2 స్పూన్స్‌
ధనియాల పొడి : 1 స్పూన్‌
టమాటలు : 3
ఉల్లిపాయ : 1
పసుపు : చిటికెడు
అల్లం, వెల్లుల్లి ముద్ద : 1 స్పూన్‌
ఆవాలు, మినపప్పు, పచ్చిశెనగపప్పు : ఒక స్పూన్
గరం మసాల : పావు స్పూన్‌
కారం : 1 స్పూన్

 

తయారు చేసే విధానం :

ముందుగా స్టవ్‌ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత తాలింపు గింజలు వేయాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసుపు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి కలపాలి.టమాటలు ఉడికిన తరువాత పచ్చి బఠానిలు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. కొద్దిసేపు మగ్గనిచ్చి తరువాత కొబ్బరి పొడి, గరం మసాల వేసి కలపాలి. బఠానిలు మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి.