Egg Prawns Pakoda
ఎగ్ ప్రాన్స్ పకోడి
కావలసినవి :
గుడ్డు -1
రొయ్యలు - 1 కప్పు
ఉల్లిపాయ తరుగు -1 కప్పు
సోయాసాస్ - అర టీ స్పూను
మైదాపిండి - అరకప్పు
కొత్తిమీర తరుగు - అర కప్పు
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను
ఆయిల్ - సరిపడా
తయారీ :
ముందుగా రొయ్యలపై పోట్టుతీసుకుని కడిగి శుభ్రం చేసి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని రొయ్యలు, మైదాపిండి, సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉల్లి తరుగు, గుడ్డు సొన, ఉప్పు వేసి బాగా కలపి పక్కన పెట్టుకుని ఈ మిశ్రమాన్ని 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక నూనెలో కలిపి ఉంచుకున్న మిశ్రమంతో పకోడీల్లా వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సాస్‌తో సర్వ్ చేసుకోవాలి