Veg Pizza
వెజ్ పిజ్జా
కావలసినవి :
పిజ్జా బేస్‌లు -2
నూనె - తగినంత
మొజిల్లా చీజ్ - 1/2 కప్పు
మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.
క్యారట్ తురుము -3 టీ.స్పూ.
కొత్తిమీర - కొద్దిగా
క్యాబేజీ తురుము- 1/4 కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - 1/4 కప్పు
టమాటో -2
ఉల్లిపాయ -1
కీరా -1
ఉప్పు - తగినంత
సాస్ తయారీ కోసం :
క్యాప్సికమ్ తురుము - 1/ 2 కప్పు
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
టమాటో ప్యూరీ - 1/2 కప్పు
వెల్లుల్లి రెబ్బలు -5
కారం పొడి - 1టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
తయారీ :
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి దోరగా వేపాలి. తర్వాత క్యాప్సికమ్ తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో టమాటో ప్యూరీ వేసి కలిపి ఉడికించాలి. ఉడుకుతున్న మిశ్రమంలో కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించాలి. తరువాత పిజ్జా బేస్‌కి రెండు వైపులా కొద్దిగా వెన్న రాసుకుని పెనం మీద రెండు వైపులా కొద్దిగా వేడి చేసుకోవాలి. తర్వాత ఒక్కో పిజ్జా బేస్ తీసుకుని ముందుగా దానిమీద క్యాబేజీ తరుము, తయారు చేసి పెట్టుకున్న సాస్ కూడా వేయాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న టమాటా, కీరా స్లైసులు, దానిమీద ఉల్లిపాయ తురుము, క్యారట్ తురుమువేయాలి. చీజ్ తురుము వేసి కొత్తిమీర చల్లి ఓవెన్‌లో పెట్టి చీజ్ కరిగేవరకు బేక్ చేయాలి.