Carrot Puri
క్యారెట్ పూరీలు
కావలసినవి :
క్యారెట్ తురుము - అరకప్పు
గోధుమ పిండి - 150 గ్రాములు
నెయ్యి -2 టేబుల్ స్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు- తగినంత
జీలకర్ర - 2 టీస్పూన్
ఆయిల్ - సరిపడగా
తయారీ :
ముందుగా గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని అందులో ఉప్పు వేసి, నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, కారం బాగా కలిపి అర గంట నాననివ్వాలి. తరువాత నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలు చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా కాగిన తరువాత చేసుకున్న పూరీలను వేసి రెండు వైపుల కాలాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి...