Aloo Sandwich

 

 

 ఆలూ శాండ్విచ్

 

  

 

కావలసినవి:
ఉడికించిన ఆలూ -2
ఉల్లిపాయ - 1
చీజ్‌  - సరిపడా
వైట్ బ్రెడ్ ‌- 8 స్లైసులు
వెన్న - తగినంత
ఉప్పు- తగినంత
చాట్‌ మసాలా- కొద్దిగా
కారం-1/2స్పూన్‌. 

తయారీ :

నాలుగు బ్రెడ్‌ స్లైస్‌లమీద వెన్నరాసి, వాటి మీద పల్చగా కట్ చేసిన ఆలూ ముక్కలు, రౌండ్ గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు,  చీజ్‌ తురుము, ఉప్పు, చాట్‌ మసాలా, కారం చల్లి మిగిలిన బ్రెడ్‌ స్లైస్‌లతో వాటిని కవర్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పెనం మీద కొద్దిగా వెన్న వేసి రెడీ చేసుకున్నబ్రెడ్ పెట్టి రెండు వైపులా కాల్చుకుని సాస్ తో సర్వ్ చేసుకోవాలి