Kachori Chaat
కచోరి చాట్
కావలసినవి :
కచోరిలు - రెండు
చాట్ మసాలా పొడి - ఒకటిన్నర స్పూన్
నిమ్మరసం - అరటీస్పూను,
గ్రీన్ చట్నీ - రెండు టీ సూన్లు
కారం - ఒకటిన్నర స్పూన్
స్వీట్ చట్నీ- రెండు టీస్పూన్లు
పంచదార - ఒక టీస్పూను
ఉడికించిన బంగాళదుంప - ఒకటి
తురిమిన క్యారట్ - మూడు టెబుల్ స్పూన్లు
టమాట - ఒకటి
ఉల్లిపాయలు - ఒకటి
పెసర మొలకలు - 1/4 కప్పు
కొత్తిమీర - సన్నగా తరిగినది
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - తగినంత,
తయారీ:
ముందుగా పెరుగులోని పంచదార వేసి బాగా చిలికి ఫ్రిజ్‌లోపెట్టుకోవాలి .తరువాత ఆలూ ను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆలూ ముక్కలు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్ , కొత్తిమీర, పెసర మొలకలు, ఉప్పు, కారంపొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత కచోరీలు తీసుకుని వాటిని మధ్యలో జాగ్రత్తగా చాకుతో కట్ చేసి లోపల ఉన్న మిశ్రమాన్ని తీసేసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఇందులో నింపాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కచోరిలు పెట్టి దానిపై పెరుగును వేయాలి. దీనిపై గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ , చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి.
